Monday, November 25, 2024

Tirumala – ఎర్ర‌చంద‌నం దోచుకున్న‌వారిని వదిలేది లేదు – కేంద్ర మంత్రి బండి సంజ‌య్

వైసిపి పాల‌న‌లో అంతా దోపిడినే
ఆడ‌వులను చెర‌బ‌ట్టి మొత్తం ఊడ్చేశారు
శ్రీవారి ఆస్తుల‌ను వ‌ద‌ల‌లేదు
అన్య మ‌త‌స్థుల‌కే ఆల‌యంలో ప్రాధాన్య‌మిచ్చారు
న‌య‌వంచ‌న పాల‌న పోయి ప్ర‌జా పాల‌న వ‌చ్చింది
ఇంక అంతా మంచే జ‌రుగుతుంది
తిరుమ‌ల‌లో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజ‌య్

ఆంధ్ర్ర‌ప్ర‌భ స్మార్ట్ – తిరుమల: ఏపీలో గత వైసిపి ప్రభుత్వ పాలకులు వీరప్పన్‌ వారసుల‌ని, ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నార‌ని మండిప‌డ్డారు కేంద్రం హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్.. తిరుమ‌లలో శ్రీవారిని నేటి ఉద‌యం ఆయ‌న ద‌ర్శించుకున్నారు.. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, . ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నార‌న్నారు..ఈ ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేద‌ని తేల్చి చెప్పారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామ‌ని. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, తిరుపతి బిజెపి నాయకులు అనేక పోరాటాలు చేశార‌ని గుర్తు చేశారు..

- Advertisement -

పంగ‌నామాల న‌య‌వంచ‌కులు పోయారు..

శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ ఆరోపించారు. కొండ మీద అరాచక పాలన ముగిసింద‌న్నారు. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాడ‌ని చెప్పారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.. ప్ర‌ధాని . నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఆయన సారథ్యంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది అని బండి సంజయ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement