Wednesday, January 1, 2025

Tirumala – శ్రీవారి సేవలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు

Tirumala – ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం బ్రేక్‌దర్శన్‌లో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అడిషనల్‌ ఈవో వెంకయ్యచౌదరి డీజీపీ దంపతులకు శ్రీవారి ప్రసాదాన్ని, తీర్థ ప్రసాదాలను, స్వామివారి ఫొటోను అందజేశారు.

డీజీపీ వెంట ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు డీజీపీకి ఘన స్వాగతం పలికారు

Advertisement

తాజా వార్తలు

Advertisement