తిరుమల రెండో ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి తిరుమల వెళ్తోన్న ఓ టెంపో వాహనం కొండని ఢీ కొట్టింది. డ్రైవర్ బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. సేఫ్టీ వాల్, రెయిలింగ్ లేకపోవడంతో టెంపో నేరుగా కొండను తాకింది. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. కొండను ఢీకొట్టిన నేపథ్యంలో టెంపో ముందుభాగం ధ్వంసమైంది. వరుస ప్రమాదాలపై టీటీడీ పాలకవర్గం సమీక్ష చేపట్టి, సూచనలు చేసిన వారంలోపే ఘటన జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్లపై వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు వారాల వ్యవధిలో నాలుగో ప్రమాదం చోటుచేసుకుంది.
Tirumala : రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కొండని ఢీ కొన్న టెంపో
Advertisement
తాజా వార్తలు
Advertisement