Monday, January 6, 2025

Tirumala – వడ్డి కాసుల వాడికి రూ 1365 కోట్ల ఆదాయం

ఏడాదికాలంలో హుండీ ద్వారా భ‌క్తుల కానుక‌లు
ఇక 2.55 కోట్ల మందికి గ‌త ఏడాది స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం
99 ల‌క్ష‌ల మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్ప‌ణ
6.30 కోట్ల మంది అన్న‌ప్ర‌సాద స్వీక‌ర‌ణ‌

తిరుమ‌ల – వ‌డ్డి కాసుల వాడికి గ‌త ఏడాది భ‌క్తులు దండిగానే కానుక‌లు స‌మ‌ర్పించారు.. తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా గతేడాది రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 2024 లో 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక‌ 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఏడాది మొత్తంలో 12.14 కోట్ల లడ్డూలు కొనుగోలు చేశారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ సత్రాలలో, అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో మొత్తం 6.30 కోట్ల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ వివ‌రాల‌ను నేడు టిటిడి విడుద‌ల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement