Wednesday, January 22, 2025

AP | బైక్ – టిప్ప‌ర్ ఢీ : దంప‌తులు మృతి

విశాఖ ఆగ‌నంపూడి టోల్ గేట్ వ‌ద్ద ప్ర‌మాదం


విశాఖపట్నం : విశాఖలోని ఆగనంపూడి టోల్‌గేట్‌ వద్ద బుధ‌వారం ఉద‌యం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు. మన్మధరావు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు.

బ్యాంకు పనిమీద దంపతులిద్దరూ ద్విచక్రవాహనంపై గాజువాక వెళుతుండగా అదే మార్గంలో వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement