తాడేపల్లి ఐజీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు.
గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలు సగటున 15 శాతం నుంచి 20 శాతం పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనిపై జనవరి 15లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి సత్యప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ర్టేషన్ విలువలను తగ్గించబోతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం శాస్ర్తీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ర్టేషన్ విలువలను పెంచిందని.. వాటన్నింటినీ సరి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
అయితే చరిత్రలో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించబోతున్నట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ విలువలను పెంచిందని సత్యప్రసాద్ అన్నారు. వాటన్నింటినీ సరి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో పెంపు, తగ్గింపు ఉండదని స్పష్టం చేశారు. కమిటీ సిఫార్సులు, గ్రోత్ కారిడార్‌ల అధ్యయనం ఆధారంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపుదల ఉంటుందన్నారు. భూసమస్యల్లో ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.