ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 13న లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.. కాగా, ఇప్పటికే ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ అడుగు ముందుకేసి వైసీపీ మేనిఫెస్టో తేదీని ఖరారు చేశారు. ఉగాది రోజున (ఏప్రిల్ 9న) వైసీపీ ఎన్నికల ఫెనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 6 హామీలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించింది. వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా ప్రజల సంక్షేమంపై హామీలు ఇచ్చారా.. లేక అభివృద్ధి, రాజధాని అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చారా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.