Friday, November 22, 2024

Counter: టైం.. డేట్ చెప్పండి ..వ‌స్తా – వైవి సుబ్బారెడ్డికి ష‌ర్మిల స‌వాల్

ఇచ్చాపురం – వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు.. డేట్.. టైం.. వాళ్లు చెప్పినా… సరే.. నన్ను చెప్పమన్నా… సరే.. వస్తా.. అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. .ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్సెక్కిన షర్మిల.. ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడంలేదని, అందుకే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని చెప్పారు

ఇచ్ఛాపురం చేరుకున్న వైఎస్ షర్మిల
కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్ది సేపటి క్రితం ఇచ్ఛాపురం చేరుకున్నారు. రోడ్డు మార్గం గుండా కె వి పి రామచంద్ర రావు, ఎన్. రఘువీరా రెడ్డి, జెడి శీలం , గిడుగు రుద్రరాజుతో కలసి ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపుకు చిహ్నంగా నిర్మించిన స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక వైఎస్‌ఆర్‌ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇ ”వైఎస్‌ఆర్‌ పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసింది. ప్రజల కష్టాలను చూసి ఆయన ఒక్క అవకాశం అడిగారు. సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇదే ఇచ్ఛాపురం నుంచి నా ప్రస్థానం మొదలైంది. దీన్ని ప్రజలు ఆశీర్వదించాలి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పథకాలన్నీ వైఎస్‌ఆర్‌ అమలు చేశారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్‌ ఎంత బలమో.. ఆయనకీ కాంగ్రెస్‌ అంతే బలం. రాజశేఖర్‌రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల్లో నిజాలు లేవు. వైఎస్‌ఆర్‌ అంటే ఇప్పటికీ పార్టీ అధిష్ఠానానికి అభిమానం ఉంది. ఆ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీయే నాకు చెప్పారు. రాజీవ్‌ గాంధీ చనిపోయాక కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు పెట్టారు. అది తెలియక చేసిన తప్పు కానీ.. తెలిసి చేసింది కాదు అని ష‌ర్మిల చెప్పుకొచ్చారు.

‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి?

- Advertisement -

జీవించినంత కాలం భాజపాకు వైఎస్‌ఆర్‌ వ్యతిరేకి. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. భాజపాకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది. భాజపాకు కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం మారింది. రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసింది. ఒక్క రోజు కూడా జగన్‌ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? రాహుల్‌గాంధీ మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానని చెప్పారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌. వైఎస్‌ఆర్‌ ఆశయాలను అందరం బతికిద్దాం” అని షర్మిల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement