అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)కు వేదికైన విశాఖ నిఘా నీడలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా శుక్రవారం నుంచి ప్రారంభమైన సమ్మిట్ శనివారం కూడా జరుగనుంది. దేశ, విదేశాల నుంచి దాదాపు 10వేల మంది ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తరలి వస్తున్నందున భద్రతకు సంబంధించి రాష్ట్ర పోలీసుశాఖ అత్యం త ప్రాధాన్యతగా తీసుకుంది. తొలిరోజు శుక్రవారం స మ్మిట్ను డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి స్వయంగా పరిశీ లించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు, అధికారులు, సిబ్బందితో కలిపి దాదాపు 3వేల మంది బందోబస్తు విధుల్లో నిమగ్న మయ్యారు. విశాఖ ప్రజల భద్రతతో పాటు- నగరానికి తరలివస్తున్న విదేశీ ప్రతినిధులకు, వి.ఐ.పిలకు, సదస్సులకు ‘మల్టీ లేయర్ భద్రత’ కల్పించారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూము ఏర్పాటు చేసి సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, వి.ఐ.పిలు ప్రయాణించే మార్గాలు, సదస్సు వద్ద సీసీ కెమె రాలతో నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ఆర్.ఓ.పిలు, ఏ.ఎస్.సి టీ-ంలతో అనుక్షణం తనిఖీలు చేస్తున్నారు. వేదిక ప్రాం గణంలో ‘యాంటీ- సాబోటేజ్ టీ-మ్స్’ తో తరచూ తనిఖీ చేస్తూ, ఎటు-వంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్నివిధాలుగా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
తొలిసారిగా విధుల్లో స్నిఫర్ డాగ్స్..
ఇప్పటి వరకు పోలీసు శునకాలు తనిఖీ బాధ్యతలు మా త్రమే నిర్వహించేవి. కాని తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌ను పోలీ సుశాఖ నిరంతర బందోబస్తు విధుల్లో భాగ స్వామ్యం చేసింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 సెక్యూరిటీలో పూర్తి స్ధాయిలో వినియోగిస్తున్న స్నిఫర్ డాగ్ టీమ్‌కు కె 9 అని నామకరణం చేశారు. పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖుల భద్రత కోసం రంగంలోకి దిగిన కె 9 శునకాలను హ్యాండిల్ చేసే హ్యాండ్లర్లకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఇచ్చారు. ఈ కె 9 బృందంలో లాబ్రడార్, డాబర్ మ్యాన్, జర్మన్ షెపర్డ్ వంటి అత్యున్నతమైన జాతి శునాలు ఉన్నాయి. విశా ఖలోని ఏడు ఆడ శునకాలతోపాటు గ్రేసీ, మార్టిన్, రియో, జానీ, రాకీ, యోధా, బ్లాక్కీ, బ్రూటస్, బిట్టు-, సీజర్, లక్కీ, రూబీ, జాకీ పేర్లు కలిగిన 13 స్క్వాడ్లు విధుల్లో ఉన్నాయి. వీటిలో రూబీ జర్మన్ షెపర్డ్ జాతి చెందింది కాగా జాకీ, సీజర్ డో బెర్మాన్ జాతి శునకాలు. మిగిలినవన్నీ లాబ్రడార్ బీడ్ర్కు చెందినవి. ఇతర జిల్లాల నుంచి కూడా మరో 14 కుక్కలను రప్పించి విధుల్లో వినియోగిస్తున్నారు. మూడు కేటగిరిలుగా ఏర్పాటు చేసిన కె 9 స్కాడ్‌లో బాంబ్ డి-టె-క్షన్ విభాగం, ట్రాకర్స్, నార్కోటిక్స్ విభాగాలు ఉన్నాయి. వాసన ద్వారా గుర్తించే సామర్ధ్యం వీటికి మనిషి కంటే 40 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్లే తొలిసారి వీటిని భద్రత విధుల్లో వినియో గిస్తున్నారు. ప్రతి 20 నిమిషాల తర్వాత ప్రతి శునకానికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ డాగ్ ఫోర్స్ అని పోలీసులు చెబుతున్నారు.
కొనసాగుతున్న ఆంక్షలు.. తనిఖీలు..
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం నుండి విశాఖపట్నం మీదుగా అనకాపల్లి వైపు వెళ్ళు అన్నీ రకాల భారీ వాహనాలను మళ్ళిస్తున్నారు. అదేవిధంగా జాతీ య, అంతర్జాతీయంగా కొలువు దీరిన ప్రముఖులు, పారిశ్రా మిక వేత్తల భద్రత దృష్ట్యా నిరంతర తనిఖీలు కొనసా గుతున్నాయి. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని హోటల్స్, లాడ్జీ లు, రిసార్టులు,గెస్ట్ హౌస్‌లను నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. సదస్సుకు హాజరగు ప్రతినిధులకు వసతి కల్పించిన హోటళ్ల వద్ద స్నిఫర్ డాగ్, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు. నగరంలో ముఖ్య ప్రాంతాలలో పికెట్స్, గార్డులను ఏర్పాటు- చేసి నిరంతరం వాహనాలను తనిఖీ కొనసాగుతోంది.
నేవీ చేత ుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్..
సమ్మిట్‌లో పాల్గొనేందుకు సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులతోపాటు-, స్వదేశ పారిశ్రామిక దిగ్గజాలు కొలువు దీరడంతో విశాఖ గగనతలంలో చారె ్టడ్ ఫ్లైట్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బాధ్యతలు ఇండియన్ నేవీ చేపట్టింది. ఇక పార్కింగ్, ప్రయాణికుల రాకపోకల బాధ్యతలు ఎయిర్‌పోర్టు ఆధారిటీ చేస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ ఎయిర్ పోర్టులో భారీగా చార్టెడ్ విమా నాలు ల్యాండ్ అవుతున్నాయి. వీటి ల్యాండింగ్ కోసం ఇప్పటికే రిలయన్స్, జీఎంఆర్, జిందాల్, అపోలో ఇలా పలు పారి శ్రామిక సంస్థల నుంచి ఎయిర్పోర్ట్ అధారిటీకి రిక్వెస్ట్‌లు వ చ్చాయి. చార్టెడ్ ఫ్లైట్లతోపాటు అదనంగా 30కి పైగా వాణిజ్య విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పదహారు పార్కింగ్ బేస్ సిద్ధం కాగా, ఇందులో 12 కొత్తవి, 4 పాతవి ఉన్నాయి. విమానాల ల్యాండింగ్ కోసం 11 వందల అడుగుల రన్‌వే సిద్ధం చేసి నట్లు తెలుస్తోంది.