Thursday, November 7, 2024

అప్పన్నపాలెంలో పులి సంచారం.. గ్రామీణుల్లో భయం భయం..

విశాఖ క్రైం, ప్రభన్యూస్‌: నర్సీపట్నం మండలంలో పులి సంచిరిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.తాజాగా వేములపూడి పంచాయితీ అప్పన్నపాలెం గ్రామ పరిసర ప్రాంతంలో పెద్దపులి రెండు ఆవులను చంపేసిన ఘటన కలకలం రేపింది. అప్పన్నపాలెం గ్రామాన్ని ఆనుకొని ఉన్న చింతా సూరిబాబు అనే రైతుకు చెందిన రెండు ఆవు దూడలు పులి పంజాకు బలయ్యాయి. ఇందులో ఒక ఆవు తలను పూర్తిగా పెద్ద పులి తినేసింది. మైదాన ప్రాంతమైన నర్సీపట్నంకు కేవలం ఏడు కిలో మీటర్ల దూరంలో పులి సంచారం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దీనితో అటవీ శాఖ అధికారులు, స్థానికుల శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారి ఫారెస్ట్‌ర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో అటవీ అధికారుల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించారు.పెద్దపులి (లెఫాల్డ్‌) అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. పాదముద్రలను పరిశీలిస్తే ఇవి పెద్దపులి అడుగులుగా ఉన్నట్లు- కనుగున్నారు.

సాధారణంగా పులి కాలి వేలి ముద్రలు ఆరు నుంచి 7 సెంటీ-మీటర్ల ఉంటాయి,పెద్దపులి పాదముద్రలు 15 సెంటీ-మీటర్లు ఉంటాయని చెప్పారు.వీటి ఆధారంగా పెద్ద పులి దాడి చేసినట్లు- నిర్దారించారు.చిరుతపులి దాడి చేస్తే తిరిగి ఆహారం కొరకు రెండు మూడు రోజుల తర్వాత ఘటనా స్థలానికి వచ్చే అవకాశం ఉంటే పెద్దపులి తిరిగి రాదని పేర్కొన్నారు.సాధారణంగా పులులు అడవుల్లో ఆహారం లభ్యం కాకపోవడం,మంచినీటి కోసం,అలాగే వేసవి తాపాన్ని తట్టు-కోలేక జనావాసాలు సమీపంలోకి వస్తుంటాయని డిఎఫ్‌ఓ తెలిపారు.అయితే పులిని స్థానికులు ఎవరు చూడలేదని సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు.పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని తెలియడంతో ఏ క్షణం ఎలా ఉంటు-ందనే ప్రజలు భయంతో ఉన్నారు. సంఘటన స్థలానికి అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన బృందాలు చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.పులి పాద ముద్రల ఆధారంగా ఎంత దూరం ప్రయాణించి ఉంటు-ందనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement