Sunday, November 24, 2024

విశాఖలో టైగర్‌ రొయ్యల ఉత్పత్తి..

ప్ర‌భ‌న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో టైగర్‌ రొయ్యల పెంపకం, బ్రీడింగ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొం దిస్తోంది. దీనిద్వారా 2024 నాటికి భారతీయ రొయ్యల పెనాయస్‌ మోనోడాన్‌ (టైగర్‌ రొయ్య) ఆక్వాకల్చర్‌ను తిరిగి తీసుకురావాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నిర్దిష్ట వ్యాధికారక రహిత (ఎస్‌పీఎఫ్‌) బ్రీడ్‌ అభివృద్ధికోసం కోసం అవసరమైన బ్రూడ్‌స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్‌ (బీఎంసీ)ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిని విశాఖలోని రుషికొండలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఏపీలోని విశాఖను కేంద్రం ఎంచుకోవడం పట్ల ఆక్వారంగ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య శాఖ సహకారంతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ ఎంపెడా (ఎంపిఈడీఏ) దీనిని పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతోంది. అండమాన్‌ నుండి, జువెనైల్‌ పి. మోనోడాన్‌లను బీఎంసీ-వైజాగ్‌కు తీసుకువస్తారు, అక్కడ వాటిని పెంచి (బ్రూడ్‌స్టాక్‌) పెద్ద చేస్తారు. వీటిని భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, దేశంలో రొయ్యల ఉత్పత్తిని పెంచేందుకు వివిధ రకాల హేచరీలకు ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement