మహానంది, (ప్రభ న్యూస్): నల్లమలలో వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలి అయినట్టు సమాచారం. పెద్దపులి మృతి ఘటన బయటికి రాకుండా కాల్చివేసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. విషయం బయటికి పోక్కడంతో నంద్యాల డి ఎఫ్ ఓ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నంద్యాల డివిజన్ లోని చలమ రైజ్ లోని పెద్ద కమ్మలూరు సెక్షన్ లో 4 రోజుల క్రితం వేటగాళ్ళు వేసిన ఉచ్చులో చిక్కి పెద్దపులి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంత కొందరు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది.
అయితే పులి వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి మరణించడంతో ఈ విషయం వెలుగు చూసింది . అయితే విషయం తెలియగానే పెద్ద కమ్మలూరు సెక్షన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పెద్దపులి ఉచ్చులో చిక్కుకుని మృతి చెందినట్టు గుర్తించిన అధికారులు విషయం బయటకు పొక్కితే తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందని పులి మృతదేహం ను అడవిలోనే కాల్చి వేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడం, మృతి చెందింది పెద్దపులి కావడంతో డిఎఫ్ విచారణ మొదలుపెట్టారు.