ఏలూరు బ్యూరో (ప్రభన్యూస్): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం శివారులో దూడపై పెద్దపులి దాడి చేసిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది. దూడను చంపి సమీప అడవిలోకి లాక్కు వెళ్లి తిన్నఆనవాళ్ళను స్థానికులు గుర్తించారు. పెద్దపులిని చూసి భయంతో స్థానిక రైతు చెట్టెక్కారు.
రైతుకళ్ళముందే దూడను పులిలాక్కుని వెళ్ళింది. రైతుసమాచారంతోఘటన స్థలానికి స్థానిక రైతులు, ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. ఈ నెల 22 వ తేదీ న కొయ్యలగూడెం అటవీప్రాంతంలో ఇదేవిధంగా దూడను చంపితిన్నసంఘటన జరిగింది. అప్పటినుండి ఏలూరుజిల్లా తూర్పుగోదావరిజిల్లాల అటవీప్రాంతాలలో పులిసంచరిస్తున్న అడుగుజాడలు చూసి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే అటవీఅధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటి నుండి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సంచరించిన పెద్ద పులి వచ్చిన మార్గంలోనే మళ్లీ అడవుల్లోకి తిరుగు ప్రయాణం చేస్తున్న ట్లు గుర్తించారు. వారం తర్వాత మార్గమధ్యలో నేడు మళ్లీ ఓ దూడను చంపి తిన్న సంఘటన వెలుగు చూసింది. పెద్ద పులిని పట్టుకుని అడవుల్లోకి పంపేందుకు ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ టీమ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.