కర్నూల్ … రెక్కల కష్టంతో బతుకీడుస్తున్న అభాగ్యులపై ప్రకృతి కన్నెర్రజేసింది.. ఆ ఇంటి దీపాలను ఆర్పేసింది.. ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.. పిడుగులే మృత్యుపాశాలుగా మారి ఓకే కుటుంబం చెందిన ముగ్గురిని బలిగొన్న సంఘటన సోమవారం కర్నూలు జిల్లా,హోలగుంద మండల పరిధిలోని పెద్దయ్యట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పెద్దయ్యాట గ్రామం చెందిన బోయ భోగరాజు (35),అతని భార్య ఎల్లమ్మ (32) కుమార్తెలు రేవతి (10), ఎనిమిదేళ్ల మల్లేశ్వరి తో కలిసి గ్రామ శివార్లలో తమ పంట భూముల్లో గొర్రెలు కాస్తున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై.. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సమీపంలోని పంట పొలాల్లో చెట్ల కింద గొర్రెల తోపాటు నలుగురు తలదాచుకున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆకాశం ఉరుములు మెరుపులకు లోనై పెద్ద శబ్దంతో పిడుగు పడగా, అక్కడ చెట్ల కింద తలదాచుకున్న బోయ భోగరాజు, కుమార్తె రేవతి అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లమ్మ, మరో కుమార్తె మల్లేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు 20 గొర్రెలు మరణించాయి. సమీపంలో పంట పొలాల్లో ఉన్న వ్యక్తులు గమనించి గాయపడిన మల్లమ్మ, మల్లేశ్వరిని హోళగుంద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోచికిత్స పొందుతూ మల్లమ్మ కొద్దిసేపటికే మృతి చెందింది. మల్లేశ్వరి చికిత్స పొందుతుంది . రెక్కల కష్టంతో బతుకీడుస్తున్న బోయ భోగరాజు, ఎల్లమ్మకు నలుగురు కుమార్తెలు, తమకున్న రెండు ఎకరాల భూమితోపాటు గొర్రెలను పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం పొలం పనులు, గొర్రెలను కాచే నిమిత్తం తన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలైన రేవతి, మల్లేశ్వరి లను వెంటపెట్టుకుని వెళ్లారు. పన్నెండేళ్ల పెద్ద కుమార్తె హంస మ్మ , రెండేళ్ల చిన్న కుమార్తె వెన్నెలను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. జీవనభృతి నిమిత్తం వంట భూమి కి వెళ్ళిన అభాగ్యులపై ఊహించని విధంగా ప్రకృతి కన్నెర్రజేసింది.. ఆ ఇంటి దీపాలను ఆర్పేసింది.. ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.. పిడుగులే మృత్యుపాశాలుగా మారి ఓకే కుటుంబం చెందిన ముగ్గురిని బలి తీసుకోగా, మల్లేశ్వరి గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు చెల్లెలు పోగొట్టుకున్న హంసమా.. దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement