Monday, January 27, 2025

AP | శ్రీశైలం మార్గంలో ఎలుగుబంటి హ‌ల్ చ‌ల్..

  • బైక్‌పై వెళ్తున్న వారిపై దాడి
  • ఒకరి పరిస్థితి విషమం

శ్రీశైలం మార్గంలో ఎలుగుబంటి క‌ల‌క‌లం సృష్టించింది. సున్నిపెంట రోడ్డులో స్కూటి మీద శ్రీశైలానికి వెళ్తున్న‌ ముగ్గురు యువకులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అయితే ఎలుగుబంటి దాడి సమయంలో… అగుగా వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ మోగించడంతో ఎలుగుబంటి అడవిలోకి పారిపోయిందని బాధితులు తెలిపారు.

దీంతో ముగ్గురు యువకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే స్పందించిన‌ స్థానికులు గాయపడిన యువకుల‌ను సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌తో శ్రీశైలం వెళ్లే భక్తుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement