సెంట్రల్ నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలకు చెందిన వైసిపి నాయకులు, కార్పొరేటర్లు వైసిపి వీడి టిడిపిలో చేరి ప్రజా సేవ చేసేందుకు ముందుకు వచ్చారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో….
29వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీపతి, 61వ డివిజన్ కార్పొరేటర్ రమాదేవి, 63వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మలతో పాటు భారీ సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి వీడి టిడిపిలో చేరారు. వైసిపి వీడి టిడిపిలో చేరిన ముగ్గురు కార్పొరేటర్లతో పాటు వీరికి మద్దతుగా వచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తులకు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా టిడిపి కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ…. వైసిపి నాయకులు ప్రజాసంక్షేమం కోరుకుంటూ టిడిపిలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యాక్రమాలు ప్రజలు ఎంతోగానో మెచ్చుకుంటున్నట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వరద సమయంలో, వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొండా ఉమా చూపించిన చొరవ వైసిపి నేతల మన్ననలు కూడా పొందిందన్నారు. ఎన్డీయే కూటమి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలే చెప్పటం ఎంతో శుభపరిణామం అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…. విపత్తును ఎదుర్కొని ప్రజలను కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలు ఆదర్శనీయమన్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించటమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా గ్రౌండ్ లెవల్ లో వున్న వారికి 25 వేలు ,పై అంతస్తులో ఉన్న వారికి పది వేలు రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవటం జరిగిందన్నారు.
ఇది దేశంలో నే ఒక రికార్డు గా అందరూ చెబుతున్నారని పేర్కొన్నారు. వరద ప్రాంతాలలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేసిన సేవలు చూసి వైసిపి నాయకులే చంద్రబాబు సేవలను మెచ్చుకోవటమే కాదు… టిడిపి లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అయితే వైసిపి నుంచి వచ్చే వారందర్నీ చేరుకోమని…ప్రజా సేవ పట్ల అంకిత భావం ఉన్న వారినే చేర్చుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు బొప్పన భవకుమార్, మాదిగాని గురునాథం, మాగంటి నరసింహ చౌదరి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, మాజీ కార్పొరేటర్ ఎరుబోతురమణ, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి నాయకులు ఉమ్మడి వెంకట్రావు, మోదుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.