ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం వారితో చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ ఉప ఎన్నిక ఇటీవల జరిగిన సంగతి విదితమే.
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.