కార్పొరేషన్, ప్రభన్యూస్: గుంటూరు కార్పొరేషన్ పరిధి అమరావతి రోడ్డులో బుధవారం భవనం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు విరిగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులు గాయపడిన సంఘటన బుధవారం చోటుకుంది. ఘటనలో బిహార్ కు చెందినా నసేబుల్ మహమ్మద్ (27), వెస్ట్ బెంగాల్ కు చెందిన మజ్ను షేక్ (34), వెస్ట్ బెంగాల్ కు చెందిన అమిత్ షెట్ (28) మృతి చెందారన్నారు. తక్షణ పరిహారంగా మృతులకు బిల్డర్ నుండి రూ.10 లక్షలు ఏక్స్ గ్రేషియా ఇచ్చేలా స్వచ్చందంగా ముందుకు వచ్చారన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు- తక్షణ చర్యలలో భాగంగా సంబంధిత వార్డ్ ప్లానింగ్ కార్యదర్శి, టి.పి.యస్ లను సస్పెండ్ చేయడంతో పాటు- చార్జ్ మేమో, పర్యవేక్షణ అధికారి ఐన ఏ.సి.పి కి చార్జ్ మేమో జారీ చేయడం జరిగిందని, అలాగే భవన నిర్మాణ ప్లాన్ రద్దుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ కమీషనర్ మాట్లాడుతూ, ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు వేగవంతం చేయించడం జరిగిందన్నారు. ఘటన పై ప్రాధమిక విచారణలో భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్ యల్.టి.పి, బిల్డింగ్ సూపర్ వైజర్ల పై అరండల్ పేట పోలీస్ స్టేషన్ యఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. మృతులకు కార్మిక సంక్షేమ శాఖలో బీమా అయి ఉం-టె-, వెంటనే ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. భవన నిర్మాణంకు పూర్తి స్తాయిలో నగర పాలక సంస్థ నుండి అనుమతులు తీసుకోలేందని, వారు దరఖాస్తు చేసిన అర్జీలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయకపోవడంతో తుది అనుమతులు ఇవ్వలేదని, సదరు డాక్యుమెంట్స్ వెంటనే అందివ్వాలని, నిర్మాణదారుకు నోటీ-సులు ఇచ్చామన్నారు. అప్పటివరకు పనులు నిలుపుదల చేయాలని కూడా నోటీ-సులు ఇవ్వడం కూడా జరిగిందని, అయినా గత రెండు రోజుల నుండి అనధికారికంగా నిర్మాణ పనులు చేపట్టారన్నారు.