Tuesday, November 26, 2024

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోస‌మే మూడు రాజ‌ధానులు : మంత్రి అవంతి

అన్ని ప్రాంతాల అభ‌వృద్ధి కోస‌మే మూడు రాజ‌ధానులు ఏర్పాటు అని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే ఇబ్బందులు రాకుండా ఉండేందుకే.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయన్నారు. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయని మంత్రి తెలిపారు. రాజధాని ఆగిందని చాలామంది ప్రచారం చేస్తున్నారు.. గతంలో అందరూ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టారు. మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే ఏం చేస్తాం? అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నామ‌ని మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement