ఆంధ్రప్రదేశ్లోని 13 మంది మంత్రులకు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. ఈ మేరకు మంత్రుల సెక్యూరిటీని అలర్ట్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అర్జీలు, విజ్ఞాపనల పేరుతో వచ్చి దాడికి పాల్పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేయడం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. కాన్వాయ్ వెళ్తున్నప్పడు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని, దాడులకు దిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి.
మంత్రులు రోజా, జోగిరమేశ్, ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి, వల్లభనేని వంశి, గ్రంథి శ్రీనివాస్ వంటి వారితో పాటు పలువురు కాపు నేతలకు కూడా ఇట్లాంటి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
- Advertisement -