Thursday, December 12, 2024

Threatning Calls : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కు బెదిరింపు కాల్స్

అమరావతి – డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ రావడం సంచలనంగా మారింది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి ఫోన్‌ కాల్స్‌ వచ్చింది.అలాగే పవన్‌ ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపాడు ఆగంతకుడు.

ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు సిబ్బంది. ఇక బెదిరింపు కాల్స్‌ పై పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం పేషీ అధికారులు.అయితే డిప్యూటీ సీఎం పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి ఆరా తీశారు హోంమంత్రి అనిత.

ఇదే నంబర్‌ నుంచి రెండు రోజుల క్రితం హోంమంత్రికి కూడా ఈ కరమైన కాల్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్‌ రావడంతో నంబర్‌ చెక్‌ చేసారు హోంమంత్రి. ఇక ఇద్దరు ఏపీ మంత్రులకు బెదిరింపు కాల్స్‌తో ఆగంతకుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు ఏపీ పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement