Wednesday, October 30, 2024

Threatning Calls – టెంపుల్‌ సిటీలోని హోటళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపులు

తిరుపతి – టెంపుల్‌ సిటీ తిరుపతిని వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ టెన్షన్‌ పెడుతున్నాయి.. తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు.

ఇప్పటి వరకు బెదిరింపులే రాగా.. ఈసారి మాత్రం గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి.

- Advertisement -

ఇలా తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్లు హోటళ్లను తనిఖీ చేయగా.. ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement