Thursday, December 12, 2024

AP | డిప్యూటీ సీఎం పవన్‌కు బెదిరింపు కాల్స్.. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ వ‌చ్చిన‌ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో… రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే దుండగుడిని గుర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రాగా, కేసు నమోదు చేసి బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

బెజవాడ బందరు రోడ్డు నుంచి పేషీకి కాల్స్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన‌ పోలీసులు.. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి విజయవాడ లబ్బీపేటకు చెందిన నూకా మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అగంతకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ కి కారణమైన ఫోన్ నెంబర్, గత రెండు రోజుల క్రితం హోం మంత్రి వంగలపూడి అనితకు కూడా అదే నెంబర్ ద్వారా బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కు హోంమంత్రికి ఒకే నెంబర్ నుండి బెదిరింపు కాల్ రావడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement