Saturday, November 23, 2024

మూడా.. ఒకటా.. ప్రజలకు ఇంకా క్లారిటీ రాలే!

ప్రభన్యూస్‌: పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 1953 అక్టోబర్‌ 1న మొట్టమొదటి భాషా సంయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ అవతరించింది. కొత్త ఆంధ్రప్రదేశ్‌ కు కర్నూలును రాజధానిగా ప్రకటించారు. దేశ విభజన బాషా ప్రాతిపదికన జరిగినప్పుడు హైదరాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై రాజధానిగా రూపాంతరం చెందింది. 2014 జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాగా, ఆంధ్రకు చంద్రబాబు నాయుడు అయ్యారు. ఆంధ్రుల కలల రాజధానిగా హైదరాబాదుకు దీటుగా అమరావతి ప్రకటించారు. 2019 లో జరిగిన రాష్ట్ర ఎన్నికలలో వైసీపీి అధినేత జగన్మోహన్‌ రెడ్డి గెలుపొందడం, ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించ‌డంతో మొదలైన ఆందోళనలు ఏడాది పూర్తి చేసుకొని మరో ఏడాది వైపు పయనిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తాయి.

విశాఖపట్నంలో ఎక్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ (పరిపాలన), అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌(అసెంబ్లీ కార్యకలాపాలు), కర్నూలులో జుడిషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సౌత్‌ఆఫ్రికాను ఉదాహరణగా చూపిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షా 60 వేల కోట్లు అవసరం ఉందని, ప్రస్తుతం నిర్మించిన నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని ప్రభుత్వం చెబుతోంది. అంత డబ్బులు సమకూర్చుకోవడం కష్టతరం అని, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించలేమని, మూడు రాజధానుల నిర్ణయంతో పెద్దగా ఖర్చు చేయకుండానే అన్ని సమస్యలు తీరుతాయని వైసీపీ నేతలు అంటున్నారు.

అమరావతి రాజధాని ఏర్పాటుతో ఊహించని స్థాయిలో జనాభా తరలిరావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలలో వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాయి. అయితే మూడు రాజధానుల ప్రకటనతో నిర్మాణ సంస్థలలో ఒక్కొక్కటిగా వెళ్లిపోవడంతో రాజధానిలో, సమీప ప్రాంతాలలో వ్యాపారాలు సన్నగిల్లాయని రాజధాని వాసులు వాపోతున్నారు. జొన్నా శివశంకర్‌ రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమరావతి ఉద్యమానిక సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గత 670 రోజులుగా రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమాలకు కమ్యూనిస్టులు అండగా నిలబడ్డారు. భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా వారికి న్యాయం జరిగే వరకు సీపీిఎం పోరాడుతుందని అన్నారు.

అమరావతి ప్రాంతంలో ఎక్కువగా మోసపోయింది దళితులే. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని మేము చేస్తున్న పోరాటంతో పాటుగా, న్యాయస్థానాలపై మాకు ఎంతో నమ్మకముంది. సీఆర్డీఏ చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు. పాలకులు మారినప్పుడల్లా చట్టాలు మారుస్తారా. రైతులను కన్నీటి పాల్చేయటం రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు. ముందు పరిపాలనకు ఒక వేదిక అంటే రాజధాని కావాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని 29 గ్రామాల్లోని రాష్ట్ర రాజధానిని కొనసాగిస్తూ ప్రకటన చేయాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement