Tuesday, November 26, 2024

సారా అమ్మకానికి ఇక ఆ కుటుంబాలు దూరం.. ప్ర‌తిజ్ఞ చేసిన 200 కుటుంబాలు

నంద్యాల జిల్లాలోని కొన్ని గ్రామాలు సారాయి అమ్మ‌కానికి దూరంగా ఉంటామ‌ని ప్ర‌తిజ్ఞ చేశాయి. అవుకు మండలంలోని కొండమనాయుని పల్లి, పిక్కిళ్ళపల్లె తండా గ్రామాల‌కు చెందిన దాదాపు 200 కుటుంబాలు నాటుసారా తయారీ వృత్తిని ఎంచుకొన్నాయి. కొన్ని సంవత్సరాల నుండి ఇదే ప‌ని చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అయితే గ్రామ పెద్దలు, వైఎస్సార్‌సీపీ నేత చల్లా సూర్య ప్రకాష్ రెడ్డి, అవుకు ఎస్ఐ జగదీశ్వర రెడ్డి, బనగానపల్లె సెబ్ సిఐ సుభాషిని ఆధ్వర్యంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సారా త‌యారీ, వాడ‌కంతో కుటుంబాలు ఎలా నాశ‌నం అవుతున్నాయ‌నేది వారికి వివ‌రించారు. దీంతో ఇక నుంచి సారా తయారీకి దూరంగా ఉంటామని స్వచ్ఛందంగా ఆ గ్రామస్తుల ప్ర‌జ‌లు ముందుకు వచ్చారు. నాటు సారా తయారీతోపాటు…అమ్మ‌కాలు కూడా చేప‌ట్ట‌బోమ‌ని ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement