Friday, November 22, 2024

తిరుమ‌ల ఘాట్ రోడ్డు మూసివేత‌.. ఎందుకంటే


తిరుమలలో భారీ వర్షాలతో టీటీడీ అధికారులు అలెర్ట్ అయ్యారు. తిరుమల ఘాట్‌రోడ్డును మ‌రోసారి మూసివేశారు. ఎడతెరిపిలేని వర్షాలు, భారీ గాలులతో ఘాట్‌రోడ్డులోని చెట్లు విరిగిపడుతున్నాయి. తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మార్గాన మొదటి ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద కొండ చరియలు విరిపడ్డాయి. దీంతో టీటీడీ అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడక‌న‌ కూడా భక్తులు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు పడుతోంది. దీంతో కపిల తీర్థం గుండం పొంగి రోడ్డుపైకి వచ్చి చేరింది నీరు. దీంతో జనావాసాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రెండో ఘాట్‌ రోడ్డులోని 14వ కిలోమీటర్‌ వద్ద కొండ చరియలు విరిగిపడుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్‌లో మట్టి తడిసి పోయింది. ఇప్పుడు పడుతున్న వర్షానికి చెట్లు కూలుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు అధికారులు. మునుపెన్నడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు తిరుపతి వాసులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement