తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. నిన్న 13 వేల పైచిలుకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం 13,412 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.01కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 4,889 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇక మే నెలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో..తిరుమల శ్రీవారి దర్శనాలు, ఆదాయంపై కరోనా ఎఫెక్ట్ గణనీయంగా కనిపించింది. శ్రీవారి హుండీ ఆదాయం సైతం బాగా తగ్గిపోయింది. మే నెల మొత్తం మీద 2లక్షల 13వేల 749 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 11కోట్ల 95లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. మే నెల 91వేల 869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement