ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టనున్నారు.
- Advertisement -
మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తయారుచేశారు. సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 సభ ముందుకు తేనుంది.