తిరుపతి సిటీ .. రాత్రి పూట దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పి పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. 40 లక్ష రూపాయలు విలువ గలిగిన 793 గ్రాములు బంగారు ఆభరణాలతో పాటు.. 12:35 గ్రాములు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నామన్నారు.కాగా దొంగపై పిడి యా క్ట్ కేసు కూడా నమోదు చేసి పరివర్తన ఛేదించే ప్రయత్నం చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో విశాఖపట్నం సీతంపేటకి చెందిన బో డ బత్తుల శీను అలియాస్ సకల శీను అలియాస్ నల్ల శీనుని అరెస్ట్ చేశారు. తిరుపతి నగరంలో పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద పగటిపూట రెక్కీ నిర్వహించి ..రాత్రిపూట ఇంటికి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలు వెండిని దొంగిలిస్తున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పి అడ్మిన్ వెంకట్రావు. ఈస్ట్ డిఎస్పి సురేంద్ర రెడ్డి. అలిపిరి సీఐ అబ్బన్న పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement