తిరుమల, ప్రభ న్యూస్ ప్రతినిధి:నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో జనవరి నెలలో జరుగు విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠద్వార దర్శనం ముగింపు, 5న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగింపు, 6న తిరుమల శ్రీవారు తిరుమనలనంబి సన్నిధికి వేంచేపు, 7న సర్వఏకాదశి, 9న తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 14న భోగిపండుగ, ధనుర్మాసం ముగింపు, 15న మకరసంక్రాంతి, సుప్రభాతసేవ పున:ప్రారంభం, 16న తిరుమల శ్రీవారు పార్వేటమండపానికి వేంచేపు, కనుమపండుగ, 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం, జనవరి 31వ తేదిన కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం లాంటి పర్వదినాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement