Monday, November 18, 2024

AP: మంత్రుల శాఖ‌లు ఇవే… ప‌వ‌న్ కు పంచాయితీ రాజ్… అనిత‌కు హోంశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారికి శాఖలు కేటాయించారు.

చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి – జ‌న‌ల‌ర్ అడ్మినిస్ట్రేష‌న్ , లా & ఆర్డర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ , మంత్రుల‌కు కేటాయించ‌ని అన్ని శాఖులు

పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధితోపాటు.. గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్‌కు కేటాయించారు చంద్రబాబు.

  • నారా లోకేష్‌కు.. గతంలో చేపట్టిన ఐటీ మంత్రిత్వశాఖతో పాటు రియల్‌టైం గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి పోర్ట్‌ఫోలియోలు అప్పగించారు.
  • హోంశాఖ విషయంలో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే వంగలపూడి అనిత చేతికి వెళ్లింది. అయితే.. శాంతి భద్రతలు మాత్రం సీఎం చంద్రబాబు దగ్గరే ఉంచుకున్నారు. హోం శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖలు అనితకు ఇచ్చారు.
  • ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పార్టీని నడిపించిన సీనియర్ పొలిటీషియన్ అచ్చెన్నాయుడికీ కీలకమైన శాఖలు దక్కాయి. వ్యవసాయంతో పాటు సహకారం, మార్కెటింగ్, పశుసంవర్దకం, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ పోర్టు ఫోలియోలు ఇచ్చారు.
  • తొలిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఈయన చేతికే వచ్చాయి. వీటితో పాటు ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ పోర్ట్‌ఫోలియోలను కేశవ్‌కు ఇచ్చారు.
  • కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ శాఖ, గనుల పోర్ట్‌ఫోలియో దక్కింది.
  • ఇంధన వనరుల శాఖను గొట్టిపాటి రవికి ఇచ్చారు.
  • పొంగూరు నారాయణకు పట్టణ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్‌ను అప్పగించారు చంద్రబాబు నాయుడు.
  • నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు నిమ్మలకు అప్పగించినట్టయింది.
  • బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన సత్యకుమార్ కు ఆరోగ్యం, కుటుంబ సక్షేమం, వైద్య విద్య శాఖలను అప్పగించారు.
  • నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌరసరఫరాల శాఖతోపాటు వినియోగదారుల వ్యవహారాలు శాఖల్ని కేటాయించారు.
  • ఎన్ఎండీ ఫరూక్ కు లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమ శాఖల్ని అప్పగించారు.
  • ఎ. రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చారు.
  • కొలుసు పార్థసారథికి గృహ, సమాచార- పౌరసంబంధాల శాఖల్ని అప్పగించారు.
  • అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ పోర్ట్‌ఫోలియోలను ఇచ్చారు.
  • బాలవీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సంక్షేమం, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ శాఖలు ఇచ్చారు.
  • కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖలు,
    జి. సంధ్యారాణికి మహిళా అండ్ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించారు.
  • బీసీ జనార్థన్ రెడ్డికి రోడ్లు అండ్ భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలను,
    టీజీ భరత్ కు పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను కేటాయించారు.
  • ఎస్. సవితకు బీసీ సంక్షేమం, వెనుకబడిన ఆర్థిక వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్,
    వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, కర్మాగాల బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలు శాఖల్ని ఇచ్చారు.
  • కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత అండ్ సంబంధాలు,
    ఎం రాం ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన అండ్ స్ప్రోర్ట్స్ శాఖల్ని అప్పగించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement