Monday, September 9, 2024

TTD | శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఇవే

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. అక్టోబరు 4 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి.

అయితే, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండ రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, ఎన్నారై, ఆర్జిత సేవల కోటా దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement