Friday, November 22, 2024

ముందస్తు ఎన్నికల్లేవ్.. సీఎం జగన్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లేవని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మన భవిష్యత్తు తదితర కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లతో పాటు నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీలో స్పష్టత ఇచ్చారు.

షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు ఎన్నికలు ఉండవని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. మంత్రివర్గ మార్పులపై పుకార్లను నమ్మవద్దని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని సీఎం జగన్ మండిపడ్డారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదో జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 21 స్థానాల్లో ఎన్నికలు వస్తే మనమే 17 గెలిచామన్నారు. మారీచులతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ వాపును చూసి బలుపు అనుకుంటోందన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను తాను పోగొట్టుకోవాలని అనుకోనని జగన్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement