(తిరువూరు, ఆంధ్ర ప్రభ) : వైన్స్ షాపుల ప్రక్కన, ఏర్పాటు చేసిన (బెల్ట్) దుకాణాలపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మంగళవారం స్వయంగా తానే దాడులు నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
తిరువూరు మండలంలో 43, నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 130 పైగా బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్ లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా, పాఠశాలలు, గృహాలు, బస్టాపుల సమీపాల్లో ఉన్న 4మద్యం షాపులను ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరుండి మూయించారు. పట్టణంలో మద్యం వికయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి, పోలీసులకు పట్టించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని సూచించారు .. దీనితో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.