Friday, November 22, 2024

మొహమాటాలకు తావులేదు..మార్పుతథ్యం

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరో విడత అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల తంత్రాన్ని సిద్ధం చేస్తోంది.. గత ఏడాది కాలంగా పార్టీ అధినేత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి నియోజక వర్గాల్లో ప్రజాదరణ కోల్పోతున్న వారికి పార్టీ వేదికలపై పలుమార్లు హెచ్చరికలు జారీచేసినా తీరు మారలేదనే నివేదికలు అందుతున్నాయి.. దీంతో మార్పు అనివార్యమని భావిస్తున్నారు.

పొరుగున ఉన్న తెలం గాణ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యే లపై అవినీతి ఆరోపణలతో పాటు ప్రజలకు దూరంగా ఉన్న కారణంగానే బీఆర్‌ఎస్‌ అధి కారాన్ని కోల్పోవాల్సి వచ్చిందనేది స్పష్టమవుతున్న నేపథ్యం లో ప్రజలతో మమేకంకాని, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారికి సంబంధించి పూర్తి స్థాయి సర్వే నివేదికను ఐ ప్యాక్‌ బృందం సీఎం జగన్‌ ముందుంచింది. దీనిపై పార్టీ ప్రతినిధుల సమావేశాల్లో ముఖ్య మంత్రి ప్రస్తావించిన సందర్భాలనేకం ఉన్నాయి.. మరో మూడు నెలల్లో ఎన్నికల కు సన్నద్ధం కానున్న నేపథ్యంలో ఇక ఉదారంగా వ్యవహరిం చటం మంచిది కాదనే భావనతో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో భవిష్యత్‌ కార్యాచరణ కు సంబంధించి ఐ ప్యాక్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రుషితో ముఖ్యమంత్రి జగన్‌ సుదీర్ఘ మంతనాలు జరిపారు. గంటల కొద్దీ జరిగిన ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 మంది ఎమ్మెల్యేలకు స్థానచలనం తప్పదనే సంకేతాలు అందుతున్నా యి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్‌ 175 తో పాటు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే నినాదాన్ని పార్టీ అధినేత జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రలతో పాటు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి ఇంటినీ టచ్‌ చేస్తున్నారు. ప్రతిప క్ష పార్టీల పొత్తులు, అభ్యర్థులు ఇంకా తేలక మునుపే ప్రజల్లో అధికార పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించటంలో ముందుంది. తన అను భవంతో పాటు తెలంగాణలో ఇటీవల వెలువ డిన ఫలితాలను బేరీజు వేసుకుని రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఐ ప్యాక్‌ ఇన్‌చార్జితో విస్తృతంగా చర్చించారు. ఐ ప్యాక్‌తో పాటు పార్టీ, వ్యక్తిగతంగా సుమారు పది వరకు సర్వేలు నిర్వహించిన అనం తరం క్షేత్ర స్థాయిలో మంత్రులు, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, క్యాడర్‌ ద్వారా అందుతున్న సమాచారాన్ని క్రోఢీకరించి ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు సమావేశాల్లో హెచ్చరికల వరకే పరిమిత మైన జగన్‌ ఇకపై ప్రజాదరణ కోల్పోయిన, కేడర్‌తో, సంబంధిత నియోజకవర్గాల ఎంపీలతో సఖ్యతలేని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సిట్టింగ్‌లకు ప్రత్యామ్నాయమా లేదా పక్కన పెట్టటమా అనే అంశాలని నిశతంగా పరిశీలన జరుపుతున్నారు. ఐ ప్యాక్‌ ఇన్‌చార్జితో జరిపిన సర్వేలో సుమారు 50 మంది వరకు సిట్టింగ్‌ స్థానాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలిసింది. జాబితాలో పలువురు మంత్రులు, పార్టీ ప్రముఖులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు మరో పార్టీ ప్రముఖునికి ఇప్పటికే ప్రత్యామ్నాయ పదవులపై తేల్చి చెప్పినట్లు వినికిడి. గ్రాఫ్‌ దెబ్బతిన్న ఎమ్మెల్యేల స్థానే కొత్త ముఖాలను తెరపైకి తేవాలనే యోచనతో ఉన్నారు. అయితే ఈ జాబితాలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న స్థానాలు.. రెబల్‌ ఎమ్మెల్యేలకు సంబంధిం చిన నియోజకవర్గాలు ఉన్నాయా లేవా అనేది ఇతమిత్ధంగా తెలియరాలేదు. మొత్తంగా 50 స్థానాలపై ఫోకస్‌ పెంచితే అనుకున్న ఫలితాలు సాధ్యపడగలవని ఐ ప్యాక్‌ ఇన్‌చార్జి రుషితేల్చిచెప్పినట్లు సమాచారం. ప్రజలతో మమేకమై ఓ మోస్తరు గ్రాఫ్‌ కలిగి ఉన్న వారికి సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ సీట్లు కేటాయించే ఉద్దేశంతో ఉన్నారు. ప్రత్యామ్నాయాల్లో భాగంగా ఇతర అసెంబ్లి స్థానాల్లో పోటీకి నిలపాలా లేదా లోక్‌సభకు ఎంపిక చేయాలా లేదా పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలా అనే మూడు అంశాలపై ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతోంది. టిక్కెట్‌ రాదనుకునే కొందరు ఎమ్మెల్యేలు పార్టీలో అపోహలు సృష్టించే అవకాశం లేకుండా వారిని సమన్వయపరచటంతో పాటు అధికారంలోకి వస్తే ఏదో పదవి ఖాయమనే భరోసా కల్పించాలని కూడా నిర్ణయించారు.ఈ 50 నియోజకవర్గాలకు సంబంధించి త్వరలో రోజు వారీ వరుస సమీక్షలు నిర్వహించి స్పష్టత ప్రకటించి పూర్తి స్థాయి విజయావకాశాలు ఉన్నవారికే టిక్కెట్‌ను ప్రకటించే దిశగా వ్యూహరచన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement