తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, బెదిరింపు కాల్స్ కు భయపడేదే లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను గతంలో మీకు వీర విధేయుడిని…ఇప్పుడు కాదని తెలిపారు. మౌనంగా వెళ్లిపోదామనుకుంటే తనను విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఈ క్రమంలోని మంత్రి కాకాణిపై మండిపడ్డారు.
ఓదార్పు యాత్ర సమయంలో జగన్ వెంట వెళ్లవద్దని కాకాణి అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తను చేసింది నమ్మక ద్రోహం అయితే ఆనంకు చేసిన మోసం కాకాణిది నమ్మక ద్రోహం కాదా అని నిలదీశారు. ఆనంను కాకాణి ఏ విధంగా క్షోభ పెట్టారో ప్రజలకు తెలుసని వెల్లడించారు. వైఎస్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నది మీరు కాదా అన్నారు. ముందు నీ నకిలీ పత్రాల కేసు చూసుకో.. నెల్లూరుకు సీబీఐ వస్తోందన్నారు. అన్ని పాములు లేస్తే.. వాన పాము కూడా లేచినట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడారన్నారు.