మంగళగిరి – ఎన్నికలలో పొత్తులుంటాయని.. మెజార్టీ సీట్లు వస్తే సీఎం పదవి అదే వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యమని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని మరోసారి తెలిపారు. లెఫ్ట్, రైట్ పార్టీలతో కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు వివరించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైతే లెఫ్ట్, రైట్ పార్టీలతో కలిసే పోటీ చేయాలని అనుకుంటున్నట్టు వివరించారు. బలమైన ప్రధాన పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎపిలో కొన్ని ప్రాంతాల్లో తమకు గతంలో 30 శాతం ఓటింగ్ వచ్చిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తమకు సరాసరి 7 శాతం ఓటు బ్యాంకు ఉన్నదని వెల్లడించారు ..
వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని జనసేనాని మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం కొంతమందిని ఒప్పిస్తామని పరోక్షంగా బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తానని సంకేతాలు ఇచ్చారు. తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ అంశంపై చర్చించానని చెప్పుకొచ్చారు. పొత్తులు అనేవి కులానికి సంబంధించిన అంశం కాదని.. రాష్ట్రానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. తమ గౌరవానికి భంగం లేకుండా పొత్తులు విషయంలో ముందుకు సాగుతామని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంటున్నారని..తాను కూడా ఇకపై క్షేత్రస్థాయిలో తిరుగుతానని పవన్ అన్నారు.
అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోందని , అందుకే జూన్ నుంచి ఇక్కడే ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే సమయంలో తాను సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో కుమారస్వామి తరహాలో తమకు గతంలో ఓ 30 సీట్ల వరకు వచ్చి ఉంటే దాని కోసం పట్టుబట్టే అవకాశం ఉంటుందని అన్నారు. అలా జరగలేదు కాబట్టి.. దీని గురించి ఏ రకంగా పట్టుబడతామని.. పరోక్షంగా తాను సీఎం అభ్యర్థిత్వం కోరబోనని తేల్చేశారు. మన బలం చూసి పదవి అన్నది రావాలని.. దీని కోసం కండీషన్లు పెడితే కుదరదని అన్నారు పవన్ .
పొత్తులుంటాయి.. మెజార్టీ సీట్లు వస్తే సీఎం పదవి అదే వస్తుంది.. పవన్
Advertisement
తాజా వార్తలు
Advertisement