(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : అత్యవసరం గా డబ్బులు అవసరం కోసం ఏటీఎంలకు వచ్చే వారిని మాయ మాటలతో ఏమార్చి, వారి వద్ద ఒరిజినల్ కార్డులను తీసుకుని డూప్లికేట్ కార్డులు మార్చి ఇస్తూ.. ఆ తరువాత ఒరిజినల్ కార్డులతో నగదును ఏటీఎంల ద్వారా డ్రా చేస్తున్న చింతల సురేష్ బాబు కృష్ణలంక పోలీసులు పట్టుకున్నారు.
కేవలం విజయవాడలోనే కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో ఇటువంటి నేరాలకు పాల్పడిన చింతల సురేష్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి రూ.2లక్షల నగదుతో పాటు 78 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఇతనిపై 25 కేసులు నమోదయి ఉండగా, కృష్ణలంక పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అదుపులోకి తీసుకున్నారు.
సురేష్ ను పట్టుకున్న కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వి నాగరాజు, ఎస్సై ఏ సూర్యనారాయణ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ఎం విజయ సారధి నాయకులను సిపిఎస్వి రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.