Tuesday, November 26, 2024

Big Breaking | అమ్మాయిని లేపుకెళ్లాడని.. యువకుడి ఫ్యామిలీపై అటాక్​, ఇల్లు ధ్వంసం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బూర్జ మండలం కొల్లివలసలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని తీసుకెళ్లాడని యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. యువతి కుటుంబ సభ్యుల దాడిలో యువకుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. యువకుడి పేరెంట్స్​, అక్క, బావలపై కర్రలతో దాడి చేశారు. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నిచర్​ మొత్తం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇది లవ్​ ఎఫైర్​గా తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి వందన, కృష్ణారావు అనే జంట కనిపించకుండా పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement