Friday, November 22, 2024

అప్పర్‌ భద్రతో తుంగభద్ర కింద ఎడారే.. కేసి, హంద్రీనీవా, ఎల్‌ఎల్‌సిపై తీవ్ర ప్రభావం..

కర్నూలు జిల్లాతో పాటు సీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేది తుంగభద్ర, కృష్ణనదికి ఉపనదియైన తుంగభద్ర నుంచి ప్రతి ఏటా శ్రీశైలంకు 180 టీఎంసీల నుంచి 200 టిఎంసిల వరకు వరద ప్రవహం చేరుతుంది. అయితే కర్నాటకలో భారీ వర్షాలు కురిస్తే మినహా తుంగభద్రకు ఆమేరకు నీటి ప్రవహం ఉంటుంది. అయితే గత రెండేళ్లు మినహా తుంగభద్రకు వరద నీటి ప్రవహం పూర్తి స్థాయిలో చేరిక అంతంతే. దీంతో వీటిపై ఆధార పడ్డ ప్రాజెక్టులు, కాలువలకు నీటి ప్రవహం లేక పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏటా తుంగభద్రకు ఆశించిన స్థాయిలో వరదలు రావడంతో ప్రస్తుతం వీటికింద సాగవుతున్న పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందుతున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం ఎగువన కర్నాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మాణంకు పూనుకోవడం దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ సాగునీటి ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఇంజనీర్‌ నిపుణుల అభిప్రాయం.

కర్నాటకలోని తుంగభద్ర జలాశయంకు సుమారు 80కి,మీ నుంచి 90 కి.మీ మధ్య దూరంలో ఈ భారీ ప్రాజెక్టును కర్నాటక చేపడుతుంది. రూ. 16,125 కోట్లతో అంచనాలతో 2014లోనేప్రాజెక్టు నిర్మాణంను ప్రారంభించింది. 2018 వరకు ప్రాజెక్టుపై వ్యయం చేసింది. మొత్తంగా అప్పర్‌ తుంగభ ద్ర ప్రాజెక్టు నుంచి 17.40 టీఎం సీలను భద్రలోకి ఎత్తిపోసీ, భద్ర ప్రాజెక్టు నుంచి 29.90 టీఎంసీలను తరలించేలా కర్నాటక అప్పర్‌ భద్రను నిర్మిస్తుంది. నీటిని తరలించే క్రమంలో కర్నాటకలోని వాణివిలాసాగర్‌, ఏపీలోని భైరవాని తిప్ప ప్రాజెక్టు మద్య వేదవతిపై రిజర్వాయర్‌ను నిర్మిస్తుంది. ఈ రిజర్వాయర్‌ను నిర్మించకూడదని గతంలోనే కేడబ్ల్యూడీటీ స్పష్టంగా వెల్లడించింది. అప్పర్‌ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌ కింద కర్నాటక, ఏపిలోని ఆయుకట్టుతో పాటు కర్నూలు జిల్లాలోని కేసి కాలువ, ఆర్‌డిఎస్‌ కింద ఆయుకట్టుకు తీవ్ర నీటి ఎద్దడీ ఏర్పడనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి ప్రవహాం రావడంలో ఆలస్యం చోటుచేసుకుంటుంది. ఇది ఆ ప్రాజెక్టు ఆయుకట్టు రైతులకు ఇబ్బందులను సృష్టించనుంది.

వాస్తవంగా కృష్ణా జలా వివాదాల ట్రీబునల్‌ ( కేడబ్ల్యూడీటీ) అప్పర్‌ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. అప్పర్‌ భద్రకు 36 టీఎంసిలు కేటాయించాలని కర్నాటక చేసిన ప్రతిపాదనను. నీటి లభ్యత లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ గతంలోనే కేడబ్యూడీటీ తొసిపుచ్చింది. ట్రీబునల్‌ కేటాయింపులు చేయకున్నా సరే. అప్పర్‌ భద్ర ద్వారా 29.90 టీఎంసీలను వినియోగించుకొని 2.26 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా కర్నాటక చేపట్టిన ఈ ప్రాజెక్టు గత ఏడాది డిసెంబర్‌ 24న సీడబ్ల్యూసీ, టీఏసీ అనుమతి ఇచ్చింది. దఇందుకు ఈ ఏడాది మార్చి 26న కేంద్ర జలశక్తిశాఖ పెట్టుబడి అనుమతినివ్వడం గమనార్హం. కేడబ్ల్యూడీటీ 1,2లు అప్పర్‌ భ ద్రకు 10 టింఎసిలు కేటాయించింది లేదు, తుంగభద్ర ఆనకట్ట ఆధునీకరణ వల్ల 6.25 , భద్ర ఆనకట్ట ఆధునీకరణ వల్ల, 0.25 టిఎంసిలు, విజయ నగర చానల్స్‌ ఆధునీకరణ వల్ల 6.25, కృష్ణా, డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటాగా దక్కిన నీటిలో 2, కృష్ణా బేసిన్‌లో ఆదనపు మిగులు జలాల రూపంలో 6 టిఎంసిల లభ్యత ఉందని, ప్రవహా, ఆవిరి నష్టాలుపోనూ మిగిలిన నీటిని అప్పర్‌ భద్ర ద్వారా వాడుకుంటామని కర్నాటక వాదిస్తుంది.

వాటి ఆధునీకరణ వల్ల నీటి వినియోగం ఏ మాత్రం తగ్గలేదని, ఆదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా అప్పర్‌ భద్రను నిర్మించడంపై దిగువ ప్రాంతాలైన ఏపి, తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయినప్పటికి వీటిని లెక్క చేయని కర్నాటక ప్రభుత్వం అప్పర్‌ భద్ర అనుమతుల కోసం సీడబ్ల్యూసీని ఆశ్రయించింది. ప్రస్తుతం ఏకంగా జాతీయ హోదా కోసం ప్రతిపాదనలు పంపింది. వీటిలో అన్ని దశలోను అనుమతులు పొందుతుంది. ముఖ్యంగా కర్నాటక చేపట్టిన అప్పర్‌ భద్రకు ఇటీవల కేంద్ర జల సంఘం ( సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) హై డ్రాలాజికల్‌ క్లియరెన్స్‌ ఇవ్వడంపై అటు ఏపి, ఇటు తెలంగాన ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తక్షణమే ఈ అనుమతులను పునం సమీక్షించి ప్రాజెక్టు చేపట్టకుండా కర్నాటకలను ఆదేశించాలని సీడబ్ల్యూసి చైర్మన్‌ను కోరాయి.

తుంగభద్రపై తీవ్ర ప్రభావం : కృష్ణ ప్రవహాంలో వరద జలాలను దారి మళ్లించి 29.90 టిఎంసిలను నిల్వ చేసుకునేలా అప్పర్‌ భద్ర ప్రాజెక్టును కర్నాటక నిర్మిస్తుంది. మొత్తం 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. వీటివల్ల కృష్ణకు ఉపనదిగా ఉన్న తుంగభద్రకు వచ్చే వరద నీటి ప్రవహాం బాగా తగ్గుతుంది. పలితంగా తుంగభద్రకింద ఉన్న కర్నూలు జిల్లాతో పాటు సీమ ప్రాంతంలోని కేసి కాలువ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు కింద ఉన్న ఆయుకట్టుకు సాగునీరు అందడం కష్టమే. ప్రస్త్తుతం తుంగభద్ర నుంచి ఎల్‌ఎల్‌సి నీటి వాట కింద 24 టిఎంసిల ఉండగా, వీటిలో ఖరీఫ్‌లో 40వేల ఎకరాలు, రబీలో 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అయితే ఏటా ఖరీఫ్‌లో 20 నుంచి 30వేల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. ఇక రబీలో 50వేల ఎకరాలకు మించి నీరు అందకపోవడం గమనార్హం. ఇక కేసి కాలువ కింద 10 టిఎంసిల వాట ఉండగా, ఏటా 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, లక్ష 75వేల ఎకరాలకు మించి నీరు అందడం లేదు, రబీలో తుంగభద్ర జలాశయంలో నీరు ఉంటే తప్పా రెండవ పంటకు నీరు ఇచ్చింది లేదు.

- Advertisement -

హంద్రీనీవా కింద నీటివాట ఉంది. కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాలకు గాను 25వేల ఎకరాలకు మించి నీరు అందడం లేదు. వీటితో పాటు తెలంగాణాలోని రాజోలి డైవర్షన్‌ స్కీం కింద 90వేల ఎకరాలకు తుంగభ ద్ర నుంచి 6 టిఎంసీల నీటివాట ఉంది. అప్పర్‌ భద్ర చేపడితే వీటన్నింటికి మరింత నీటి కష్టాలు తప్పవని జలవనరుల ఇంజనీర్ల అభిప్రాయం. కృష్ణా బేసిన్‌లోని ఏపి, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలంకు కూడ వరద ప్రవహాం తగ్గుతుంది. తుంగభ ద్రకు వరద సమయంలో ప్రతిఏటా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసంలో 150 నుంచి 200 టిఎంసిల వరకు నీరు శ్రీశైలంకు చేరుతుంది. గత ఏడాది 228 టిఎంసిల నీరు చేరగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 257 టిఎంసిల నీరు శ్రీశైలంకు చేరుకుంది. కృష్ణ, తుంగభద్రలకు వచ్చే వరద ఆధారంగానే శ్రీశైలంకు నీరు చేరుతుంది. ప్రస్తుతం కర్నాటక అప్పర్‌ భద్ర చేపడితే శ్రీశైలంకు నీటి చేరిక జాప్యం అయ్యే అవకాశం లేకపోలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement