గాంధీ విగ్రహం ముందు కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన
గాంధీ విగ్రహానికి వినతి పత్రం – కాంగ్రెస్ నేతలు
ఎమ్మిగనూరు టౌన్, అక్టోబర్ 2(ప్రభ న్యూస్) : బీజేపీ నిరంకుశ పాలన తొలగిపోవాలని బుధవారం గాంధీ జయంతి సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కాశీం వలి, యన్ యస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేశ్ యాదవ్, పట్టణ నాయకులు ఖలందర్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామ్యం పరిరక్షణ జరగాలని కోరుతూ గాంధీ విగ్రహం ముందు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేసి, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతిపత్రం గాంధీ విగ్రహానికి అందించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం దేశంలో కులమత తేడాలతో ప్రజలకు చిచ్చు పెడుతుందని, గాంధీ మార్గంలో ప్రస్తుత ప్రభుత్వాలు నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, యువత ప్రతి ఒక్కరూ గాంధీవాద మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారన్నారు.
మహాత్మా బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడాలని కోరారు. దేశంలో నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్నంటాయన్నారు. పెరిగిన ఈ ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బనవాసిజైపాల్, రఫిక్, ఇబ్రహీం, లోకేష్, భాష, విష్ణు, హర్ష, హరీష్, రాజు, మహబూబ్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.