Saturday, January 11, 2025

Tirumala | భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పిన టీటీడీ పాలక మండలి

తిరుమల : తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు లేకపోయినా సరే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే టీటీడీ బోర్డు సమావేశం జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు తరఫున ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

- Advertisement -

పాలకమండలి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీర్ నాయుడు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగి రారు కదా?.. ఎవరో ఏదో మాట్లాడారని దానిపై స్పందించాల్సిన పనిలేదు’. అని అన్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్నందున దానిపై మరోసారి మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు తాము పాటిస్తున్నామని, తమ తప్పు లేకపోయినా సరే.. క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. దీంతో పాటుగా బీఆర్ నాయుడు చేసినవ్యాఖ్యలపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తాను చేసిన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.

‘నా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదు.. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలి’ ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement