నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడకు చెందిన ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఆదివారం టోల్ గేట్ సమీపంలోని డివైడర్ను ఢీకొట్టింది. ఆ టూరిస్ట్ బస్సుల్లో 38 మంది ప్రయాణికులున్నారు.
కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తుండగా…ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. భద్రతా సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -