టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కౌరవ సభను తలపించేలా సభ నడుస్తుంటే ఇక సమావేశాలకు వెళ్లి ఏం లాభమని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆయన చెప్పారు. కనీసం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా ముఖ్యమంత్రి జగన్ ను పొగడటమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital