Thursday, November 21, 2024

ఏపీ ప్రభుత్వ సిట్ పై.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతిలో భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వం విధానపరమైన, ఆర్థిక పరమైన నిర్ణయాలతో పాటు ఇతర అంశాలపై విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గతంలో సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు సవాల్ చేయడంతో సెప్టెంబర్ 15న హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు స్టే ను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది.
న్యాయమూర్తులు ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ముందు రెండు రోజులు విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు ముగియడంతో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement