ప్రభన్యూస్, ఒంగోలు : ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. వర్షాకాలం అయినప్పటికీ సూర్యడు భగభగ మండిపోతున్నారు. ఉదయం నుంచే అధిక ఉష్ణోగ్రతలతో విరుచుపడిపోతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకిపోతున్నారు. ప్రకాశం, బాపట్లలో ఎండమేడిమి మరింత ఎక్కువగా ఉంటోంది. 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నవెూదు అవుతున్నాయి.
ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కరెంట్ కోతలు కూడా ప్రజలను ఇక్కట్లలోకి పడేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో తప్ప కోస్తా బెల్టులో ఎండలు మండిపోతున్నాయి. స్కూలు విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన మూడు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈసారి ఎక్కడా కూడా వర్షాలు పడలేదు. దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.