ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓ వీడియో హల్చల్ అవుతోంది. వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజనీని ఓ పిల్లాడు ముద్దు పెట్టుకున్న వీడియో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంత్రి తన బర్త్ డే వేడుకల్లో భాగంగా ఓ మీటింగ్కు అటెండ్ అయ్యారు. అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. స్కూలు పిల్లలతో క్రౌడ్ కూడా బాగానే ఉంది. పిల్లలంతా మంత్రి రజినీనీ చుట్టుముట్టి షేక్ హ్యాండ్స్ ఇస్తూ మురిసిపోతున్నారు.
ఇంతలో ఈ హఠాత్పరిణామం జరిగింది. మంత్రి విడదల రజినీకి ఎదురుగా ఉనన వరసలో ఓ పిల్లాడు ఆమె బుగ్గ గిల్లి మరీ ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియోలో అది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోని రజనీ ముసి ముసి నవ్వులు నవ్వుతూ అలా ముందుకెళ్లి పోయారు..
ఈ వీడియో కోసం.. www.prabhanews.com లోని వీడియో సెక్షన్లో చూడొచ్చు