Thursday, November 21, 2024

రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయం.. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజధాని నగరాన్ని నిర్ణయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయం మరోసారి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని విషయంలో సందిగ్ధత ఉందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత ఏది రాజధానో అర్థం కావడం లేదని జీవీఎల్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సభలో కోరారు.

జీవీఎల్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాజధాని నగరాన్ని నిర్ణయించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సమాచారం ప్రకారం తొలుత అమరావతి రాజధాని అని, ఆ తర్వాత 3 రాజధానుల అంశాన్ని కూడా ప్రభుత్వం తెలియజేసిందని చెప్పారు. అయితే 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నందున, తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని కేంద్ర మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement