Tuesday, November 26, 2024

AP | ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది : చంద్రబాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పెడనలో జరుగుతున్న రోడ్ షోలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అధికారం కోసం జగన్ ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దుడే గుద్దుడు అని విమర్శించారు.

జగన్ మళ్లీ గులక రాయి అంటూ డ్రామాలాడుతున్నారు అని మండిపడ్డారు. జగన్ పై తాను హత్యా ప్రయత్నం చేశాడని అంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయ‌ని ఆయన తెలిపారు. ప్రజల కోసం మూడు పార్టీలు కలిశామని, ప్రజల కోసం అందరం తగ్గామన్నారు. 20-30 మంది ఎమ్మెల్యేలు వైసీపీని విడిచిపెట్టారన్నారు.ఎంపీటీసీలు, జడ్పిటీసీలు సర్పంచ్ లు అందరూ ఎన్డీఏలో చేరాలని కోరారు.

పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్ల సమస్య లేకుండా తీర్చామని గుర్తుచేసారు. తాము అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తిచేసే వాళ్ళమన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది…అందుకే పొత్తు పెట్టుకున్నామన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు గుర్తుచేసారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే ఎన్డీఏకు ఓటేయాలన్నారు. మళ్లీ వైసీపీకి ఓటేస్తే మురిగిపోతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement