తిరుపతి : తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడం దురదృష్టకరమని మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు.
పద్మావతి పార్క్ ఏరియా, ఎంజీఏం హైస్కూల్ వద్ద క్యూలైన్లు, కౌంటర్లను భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడుతూ జాగ్రత్తలు సూచిస్తూ నెమ్మదిగా వెళ్లి టిక్కెట్లు తీసుకోవాలని భూమన, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు.
- Advertisement -